ప్రిన్సిపాల్ అతి ఉత్సాహం వల్ల 150 మంది విద్యార్థిని ల జుట్లు కత్తిరించి ,వాటిని అమ్ముకున్న సంఘటన మెదక్ జిల్లా కేంద్రంలో ని మినీ గురుకులములో వెలుగులో కి వచ్చంది.. ప్రిన్సిపాల్ నిర్వకము వల్ల ఎంతో మంది సమాచారం ఇవ్వకుండానే జట్లు కత్తిరించడం అమానుష చర్య అనితల్లిదండ్రులు నివ్వెరపోయారు.. ఈ విషయం ఆలస్యం లోకి వెలుగులోకి రావడంతో హాలచల్ అయ్యింది..ప్రిన్సిపాల్ అతి ఉత్సాహం పట్టణము లో హార్త్ టాపిక్ గా మరింది..
మెదక్ పట్టణములోని మినీ గురుకుల పాఠశాల లో 180 విద్యార్థునిలు వున్నారు.. 1వ తరగతి నుండి 6 వరకు విద్యార్థులు ఉంటారు..ఐతే ఇక్కడ కనిపించే విద్యార్థినిలు బాలురు అనుకుంటే పోయారపాటే... శుక్రవారం నాడు విద్యార్థినిలకు గురుకుల పాఠశాల టీచర్ ప్రిన్సిపాల్ ఆదేశాల మేరకు జుట్టు కత్తిరించారు.కత్తిరించిన జుట్టు ను కీలో మూడు వేల రూ.చొప్పున అమ్ముకున్న సంఘటటన విద్యార్థులప్ తల్లిదండ్రులకు తెలిసింది.అదే రోజు విద్యార్థులు తల్లిదండ్రులు మినీ గురుకుల పాఠశాలకు చేరుకొని స్కూల్ టీచర్లను మా పిల్లల జట్టు ఎందుకు కత్తిరించారని నిలదీసి వారి పై దాడికి దిగారు. అయితే మూడు రోజులు సెలవు ఉండటంతో ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని మా విద్యార్థినిల జుట్టు కత్తిరించడం ఏమిటని వారు మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ జిల్లా మొత్తంలో వసతులు లేని విధంగా విద్యార్తినిలకు జుట్టు కత్తిరింపులు చెయ్య డo అమానుష చర్య గా విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు నివ్వెరపోయేలా కలిగేలా చేసిందన్నారు. వారి మనోభావాలు గిరిజనవిద్యార్థుల కావడం వల్ల ప్రతి సంవత్సరం మొక్కులు చెల్లించకుండా,పుట్టిన వెంట్రుకలు తీయకుండా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు... ఈ విషయమై ప్రిన్సిపాల్ అరుణ కుమారి ని వివరణ కోరగా విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా rco అనుమతి తీసుకొని జుట్టు కత్తిరింపులు జరిగిందని తెలిపారు.. అంతే తప్పా వేరే కాదని అన్నారు. వారి మనోభావాలు దెబ్బతినతిట్లు అయితే క్షమించగలరు అని చెప్పారు
0 Yorumlar